ఏడాదికి 100.. తోపులకే తోపు ఈ హీరో..!

స్టార్ హీరోలు తీసే ప్రతి సినిమాకు వచ్చే రెమ్యునరేషన్‌తో తమ ఆదాయాన్ని పెంచుకుంటూ పోతారు. ఈ విధంగా తమ సినిమాలతో మంచి సంపాదనతో ఏదో రకంగా వార్తల్లో నిలుస్తారు మన హీరోలు. అయితే వారు ఎన్ని సినిమాలు చేసినా వారి సంపాదన ఒక పరిమితి మేర ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ ఓ స్టార్ హీరో మాత్రం ఏకంగా సెంచరీ చేసి మిగతా స్టార్ హీరోలకు కడుపుమంట పుట్టిస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసుకుందామా..!

బాలీవుడ్‌లో యాక్షన్ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న హీరో అక్షయ్ కుమార్ వరుసబెట్టి సినిమాలు చేస్తూ తన సత్తా ఏమిటో ఆడియెన్స్‌కు చూపిస్తున్నాడు. కాగా ఈ హీరో సంపాదన పరంగానూ తన సత్తా చాటుతున్నాడు. మిగతా హీరోలలా కాకుండా ఏకంగా ఏడాదికి రూ.100 కోట్లు వెనకేస్తున్నాడు ఈ యాక్షన్ హీరో. వరుసబెట్టి సినిమాలు చేయడమే కాకుండా వాటిని బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్లుగా మారుస్తూనే.. తన సంపాదనను కూడా పెంచుకుంటూ పోతున్నాడు ఈ హీరో. బాలీవుడ్‌లో మిగతా హీరోలెవ్వరికీ ఈ ఫీట్ సాధ్యం కావడం లేదు.

ఏదేమైనా తన సినిమాలను సక్సెస్‌ల పెట్టడమే కాకుండా సంపాదనతోనూ మిగతా హీరోలకు నిద్ర లేకుండా చేస్తున్న అక్షయ్, ప్రస్తుతం ఉన్న ఫాంలో ఎవరూ అతడిని టచ్ కూడా చేయలేరని అంటున్నారు సినీ క్రిటిక్స్. అటు యాడ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గానూ అక్షయ్ తన స్టామినా చూపిస్తున్నాడు.

Leave a comment