సిఎం భార్య మళ్ళీ సినిమాల్లోకి.. గొడవలపై స్పందించిన నటి రాధిక..!

కర్ణాటక సిఎం కుమారస్వామి రెండో భార్య రాధిక కన్నడ నటీమణి అన్న విషయం తెలిసిందే. యువ హీరోలతో రాధిక సినిమాలు చేస్తున్న సందర్భంలో ఆమెను చూసి నచ్చిన కుమారస్వామి ఆమెను పెళ్లాడాడు. వాళ్లిద్దరికి ఓ బేబీ కూడా ఉంది. అయితే కుమారస్వామిని పెళ్లాడిన టైంలో తన గురించి అందరు రకరకాల వార్తలు రాశారని.. వాటి గురించి అప్పుడు కాస్త బాధపడ్డా తర్వాత అలవాటైందని అన్నది రాధిక.

మనం ఎవరిని పెళ్లాడలి అన్నది కొన్ని సందర్భాల్లో మన చేతిలో ఉండదని. అయితే తను కుమారస్వామిని పెళ్ళాడిన తర్వాత తన జీవితంలో పెద్దగా మార్పులేమి రాలేదని. అప్పుడు సినిమా హీరోయిన్ గా వార్తలు రాస్తే.. ఇప్పుడు రాజకీయ నాయకుడి భార్యగా వార్తలు రాస్తున్నారని చెప్పుకొచ్చింది. ఈమధ్య ఆయన పాలిటిక్స్ లో బిజీ అవడం తను కూడా మళ్లీ సినిమాల్లో నటించడం జరుగుతుందని.. అంతేకాని తమ మధ్య గొడవలయ్యాయని.. విడిపోయామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పుకొచ్చింది రాధిక.

తన భర్త పేరు తన నోటితో పలకలేనని.. అలా పిలవడం తమ సాంప్రదాయం కాదని.. అలా పిలిస్తే భర్త ఆయుష్షు తగ్గుతుందని అన్నారు రాధిక. మేము చాలా సంతోషంగా ఉన్నా ఇద్దరం కలిసి కనిపించనంత మాత్రానా విడిపోయినట్టు కాదని చెప్పారు రాధిక.

Leave a comment