సెన్సార్ పూర్తి చేసుకున్న సందీప్ హార్రర్ మూవీ

యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నిన్ను వీడని నీడను నేను’ హార్రర్ థ్రిల్లర్‌గా తెలుగు ప్రేక్షకులను పోస్టర్స్, టీజర్స్‌తో బాగానే ఆకట్టుకుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్‌లో దూసుకుపోతోంది. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. కాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సభ్యులు చాలా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. సినిమాలో చాలా పాజిటివ్ విషయాలు సెన్సార్ బోర్డు సభ్యులు తెలిపినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా కథ, కథనం, చిత్ర టేకింగ్ అద్భుతమని వారు అన్నారట. ఇక ఈ సినిమాలో ఉండే థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ సినిమా చూస్తేనే పొందవచ్చని వారు అన్నారు. ముఖ్యంగా సందీప్ కిషన్ నటన ఈ సినిమాకు మేజర్ అసెట్ కానుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ పీక్స్ అని సెన్సార్ సభ్యులు థ్రిల్లింగ్ అనుభవాన్ని చిత్ర యూనిట్‌తో పంచుకున్నారట. జూలై 12న రిలీజ్ కానున్న ఈ సినిమాపై చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.

Leave a comment