దుమ్మురేపిన షకలక శంకర్ ‘ కేడీ నెం.1 ’ ట్రైలర్..!

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు షకలక శంకర్. తర్వాత వెండి తెరపై చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన షకలక శంకర్ తర్వాత ‘శంభో శంకర’ మూవీ హీరోగా మంచి గుర్తింపు, భారీ ఓపెనింగ్స్‌ రాబట్టుకున్న షకలక శంకర్‌ నటిస్తోన్న తాజా మూవీ `నేనే కేడీ నెం-1’. ఆర్ ఏ ఆర్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బేన‌ర్ పై ఎం.డి రౌఫ్ స‌మ‌ర్ప‌ణ‌లో జాని స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

ఈ మూవీలో షకలక శంకర్ సరసన ముస్కాన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. ఈ మూవీ అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెల 26న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన టీజర్ రిలీజ్ కాగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ మ‌ధ్య కాలంలో మంచి కంటెంట్ తో వ‌చ్చిన చిన్న మూవీస్ బాగా ఆడుతూ, మంచి వ‌సూళ్లు సాధిస్తూ పెద్ద సినిమాల స‌ర‌స‌న చేరుతున్నాయి.

మంచి కంటెంట్ తో సినిమా వస్తున్న సినిమాలు ప్రొడ్యూసర్స్ కి వరాలుగా మారాయి. తాజాగా `నేనే కేడీ నెం-1’ ట్రైలర్ విషయానికి వస్తే..పోకిరిగా తిరిగే ఓ యువకుడు ఓ యువతిని రక్షించడానికి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు..సమాజం, ప్రజలు, తల్లిదండ్రులపై ఎందుకు కోపం పెంచుకున్నాడు అన్న కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కించారట. షకలక శంకర్, ముస్కాన్, ముకుల్ దేవ్‌, నికిషా ప‌టేల్ , క‌రాటే క‌ళ్యాణి, దేవ‌న్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి సంగీతంః అజ‌య్ ప‌ట్నాయ‌క్‌; కెమెరాః శ్రావ‌ణ్ కుమార్; ఎడిట‌ర్ః సాములేటి శ్రీనివాస్ ; స్టోరీ – స్క్రీన్ ప్లే-ద‌ర్శ‌క‌త్వం- నిర్మాతః జాని

Leave a comment