ఒక సినిమా ఏడు గెటప్పులు స్టార్స్ కు షాక్ ఇస్తున్న యువ హీరో..!

యువ హీరో నాగ శౌర్య ఛలోతో సూపర్ హిట్ అందుకున్నా మళ్లీ ఆ తర్వాత రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యే సరికి కెరియర్ లో వెనుక పడ్డాడు. రీసెంట్ గా వచ్చిన ఓ బేబీ సినిమాలో ఓ చిన్న రోల్ లో నటించి మెప్పించాడు నాగ శౌర్య. ప్రస్తుతం అతను హీరోగా వస్తున్న సినిమాకు టైటిల్ గా అశ్వద్ధామ అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు సంతోష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో పాటుగా అవసరాల శ్రీనివాస్ ఫలానా అమ్మాయి ఫలానా అమ్మాయి సినిమా కూడా చేస్తున్నాడు నాగ శౌర్య. ఈ సినిమాలో ఈ యువ హీరో ఏకంగా ఓ 7 గెటప్పులలో కనిపిస్తాడని తెలుస్తుంది. నాగ శౌర్యను హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది అవసరాల శ్రీనివాసనే. అందుకే అతనితో మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. యువ హీరో 7 వేరియేషన్స్ ఉన్న పాత్ర అనగానే టాలీవుడ్ లో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ ఏర్పడింది.

ఈమధ్య యువ హీరోలంతా కొత్త కొత్త కథలతో పాత్రలతో అలరిస్తున్నారు. మరి నాగ శౌర్య లక్ ఎలా ఉందో చూడాలి. ఈ సినిమాతో పాటుగా పార్ధు అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడట నాగ శౌర్య. చూస్తుంటే వరుస సినిమాలతో నాగ శౌర్య మంచి స్పీడ్ మీద ఉన్నాడని అనిపిస్తుంది. ఓ బేబీ లో చిన్న పాత్ర అయినా ఎందుకు చేశారంటే సక్సెస్ ఫుల్ సినిమాలో చిన్న రోల్ అయినా తనకు సంతృప్తి ఇస్తుందని చేశానని సినిమా మీద తనకు ఉన్న ఇష్టాన్ని చెప్పుకొచ్చాడు నాగ శౌర్య.

Leave a comment