స‌మంత‌పై దారుణ‌మైన ట్రోలింగ్‌…. రీజ‌న్ ఇదే..

పెళ్లి తర్వాత కూడా హీరోయిన్‌గా సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. టాలీవుడ్ లోకి ఏ మాయ చేశావే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత… చివరకు ఆ సినిమాలో హీరోగా నటించిన అక్కినేని వారసుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి కుటుంబానికి వెళ్లిన సమంత పెళ్లి తర్వాత కూడా హాట్ హాట్ డ్రెస్సులతో అభిమానులను ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. పెళ్లి తర్వాత కూడా భర్తతో కలిసి ఆమె చేసిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హాట్ హాట్ డ్రెస్సుల విషయంలో ట్రోలింగ్‌కు గురవుతున్న సమంత. తాజాగా ఇప్పుడు మరో కాంట్రవర్సి ఇష్యూలో చిక్కుకొని మళ్లీ నెటిజన్ల ట్రోలింగ్‌కు గురవుతోంది.

రీసెంట్‌గా అర్జున్‌రెడ్డి ద‌ర్శ‌కుడు సందీప్ ఓ అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు ఒకరినొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం వంటివి చేయకపోతే ఆ బంధంలో ప్రేమ ఉండదని తన అభిప్రాయం చెప్పాడు. దీనిపై కొంద‌రు హీరోయిన్లు, మ‌హిళా సంఘాలు విరుచుకుప‌డ్డాయి. అప్పుడు స‌మంత కూడా సందీప్ మాట‌ల‌పై ఫైర్ అయ్యింది. ఇప్పుడు నెటిజ‌న్లు స‌మంత‌ను ఓ ఆటాడుకుంటున్నారు.

రంగ‌స్థ‌లం సినిమాలో రామ్‌చ‌ర‌ణ్ స‌మంత‌ను కొట్టే సీన్ ఫొటోలు స్క్రీన్‌షాట్లు తీసి స‌మంత పోస్టుల క్రింద కామెంట్ల బాక్సుల్లో పెడుతున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం స‌మంత ఫుడ్ లేదా సెక్స్ ఈ రెండిట్లో మీరు దేనికి ప్ర‌యార్టీ ఇస్తార‌న్న ప్ర‌శ్న‌కు స్పందిస్తూ ఆమె సెక్స్ అని సమాధానమిచ్చింది. లక్ష‌లాది మంది చూస్తుండ‌గా సెక్స్ కావాల‌ని చెప్పిన నువ్వు సందీప్‌రెడ్డి అభిప్రాయాన్నే త‌ప్పుప‌డ‌తావా ? అని కూడా కామెంట్ల‌తో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

ఇక రీసెంట్‌గా ఓ బేబీ ప్రి రిలీజ్ ఫంక్ష‌న్‌కు సైతం చాలా ద‌రిత్ర‌మైన డ్రెస్సుతో వ‌చ్చావు… అక్కినేని ఇంట కోడలిగా ఉండి.. పెళ్ల‌య్యాక ఇంత చెత్త, హాట్ డ్రెస్సులు నీకు అవ‌స‌ర‌మా ? అని కూడా స‌మంత‌పై దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. మ‌రి స‌మంత ఈ వ్యాఖ్య‌ల‌పై ఎలా స్పందిస్తుందో ? చూడాలి.

Leave a comment