ట్రైలర్ టాక్: పొలిటికల్ పవర్‌‌తో‌ ఓటర్ వార్

మంచు విష్ణు నటించిన ఓటర్ చిత్రం అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కాకుండా ఆగిపోయింది. చిత్ర నిర్మాతలతో విష్ణుకు విభేదాలు రావడంతో ఈ సినిమా రిలీజ్ ఆలస్యం అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యారు. కాగా ఇందులో భాగంగా ఓటర్ చిత్ర ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

పూర్తిగా పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఓటర్ చిత్ర ట్రైలర్, టైటిల్ మాదిరిగా చాలా పవర్‌‌ఫుల్‌గా ఉంది. మంచు విష్ణు ఓ సామాన్యుడి పాత్రలో రాజకీయ నాయకులతో ఢీకొనే అంశాన్ని ట్రైలర్‌లో రివీల్ చేశారు. పొలిటీషియన్‌ పవర్ చూపిస్తానంటూ సంపత్ రాజ్ ఛాలెంజ్ చేయడం.. ఆ పవర్ ఇచ్చిన ఓటర్ స్టామినా చూపిస్తానంటూ విష్ణు కౌంటర్ ఇవ్వడం.. చాలా బాగుంది. ఇక ఈ సినిమాలో ప్రస్తుత రాజకీయ అంశాలను మనకు చూపించారు చిత్ర దర్శకుడు.

అడ్డా చిత్రంతో దర్శకుడిగా సత్తా చాటిన జీఎస్ కార్తీక్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా.. థమన్ అదిరిపోయే బీజీఎం ఈ ట్రైలర్‌కు అదనపు బలాన్ని ఇచ్చింది. ఈ సినిమాను జూన్ 21న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నారు. మరి ఈ ఓటర్ సినిమా లవర్‌ను ఎంత మేర మెప్పిస్తాడో చూడాలి.

Leave a comment