‘ గేమ్ ఓవ‌ర్ ‘ బాక్సాఫీస్ వీరంగం… డ‌బుల్ క‌లెక్ష‌న్స్‌

ఈ శుక్ర‌వారం టాలీవుడ్‌లో రిలీజ్ అయిన నాలుగు సినిమాల్లో తాప్సీ న‌టించిన గేమ్ ఓవ‌ర్ కూడా ఉంది. ప్రివ్యూల నుంచే ఈ సినిమాకు సూప‌ర్ రెస్పాన్స్ రావ‌డంతో ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఆసక్తి పెరిగింది. దీంతో ఈ నాలుగు సినిమాల్లో గేమ్ ఓవ‌ర్‌కే మంచి వ‌సూళ్లు ద‌క్కాయి. గేమ్ ఓవ‌ర్ మొత్తం మూడు భాష‌ల్లో రిలీజ్ అయ్యింది. మొదటిరోజు శుక్రవారం హిందీలో 38 లక్షలు, తమిళంలో 30 లక్షలు, తెలుగులో 29 లక్షలు కలిపి మొత్తంగా రూ. 97 లక్షలు రాబట్టింది.

శుక్ర‌వారం టాక్ బాగా ఉండ‌డంతో శ‌నివారం వ‌సూళ్లు ఏకంగా డ‌బుల్ అయ్యాయి. శ‌నివారం హిందీలో 88 ల‌క్ష‌లు, తెలుగులో 56 ల‌క్ష‌లు, తమిళంలో 50 లక్షలు కలిపి మొత్తంగా 1.94 కోట్లు వసూలైంది. అనగా రెండు రోజులకు కలిపి రూ. 2.91 కోట్లను ఖాతాలో వేసుకుంది. ఇక ఆదివారం కూడా గేమ్ ఓవ‌ర్‌కు మంచి వ‌సూళ్లే వ‌చ్చాయ‌ని తెలుస్తోంది.

సినిమాకు రోజు రోజుకు టాక్ పెరుగుతుండ‌డంతో వీకెండ్ త‌ర్వాత వీక్‌డేస్‌లో కూడా ఈ వ‌సూళ్లు స్టడీగా కొన‌సాగే అవ‌కాశం ఉంది. వీడియో గేమ్ నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా సాగుతుంది. ద‌ర్శ‌కుడు అశ్విన్ శరవణన్ కథాకథనాల్లో కొత్తదనంతో పాటు థ్రిల్లింగ్ అంశాలను జోడించి అలాగే సస్సెన్స్ బాగా ఎలివేట్ చేస్తూ.. సినిమాను చక్కగా మలిచారు.

Leave a comment