సినిమాలు లేవని.. ఇక ఆపని చేసిన బ్యూటీ?

తెలుగు హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ స్టేటస్‌ సాధించాలనేది చాలా మంది అమ్మాయిల కల. అయితే వారి కల కలగానే మిగిలిపోతుందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ జాబితాలో తెలుగు అమ్మాయిల సంఖ్య ఎక్కువని చెప్పాలి. అసలే తెలుగు అమ్మాయిలంటే మన ఇండస్ట్రీలో చాలా చిన్న చూపు. కాగా తాజాగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్న ఓ హీరోయిన్ ఏం చేసిందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

తెలుగులో దాదాపు పది సినిమాల్లో నటించిన తెలుగమ్మాయి అనీషా ఆంబ్రోస్ ప్రస్తుతం సినిమా ఛాన్సులు ఎక్కువగా లేకపోవడంతో.. చేసేదేమీ లేక పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల 7 అనే సినిమాలో నటించినా అమ్మడికి అనుకున్న రేంజ్‌లో సక్సె్స్ మాత్రం రాలేదు. చేసిన 10 సినిమాలు కూడా ఆమెకు గుర్తింపు రాకపోవడంతో అమ్మడు బాగా ఫీల్ అయ్యింది. దీంతో ఈ బ్యూటీ పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. కాగా ఇప్పుడు అమ్మడు పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అమ్మడు ఎవరిని పెళ్లి చేసుకుంది అనే విషయం మాత్రం సస్పెన్స్‌గా మారింది.

ఇలా ఓ తెలుగమ్మాయి కెరీర్‌లో సక్సెస్ కాకపోవడంతో చివరకు పెళ్లి చేసుకుందని తెలుగు ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా అమ్మడి వివాహ జీవితం సంతోషంగా ఉండాలని ఆడియెన్స్ కోరుతున్నారు.

Leave a comment