మహర్షి దెబ్బకు తట్టాబుట్టా సర్దేసిన మహేష్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సెన్సేషన్ మహర్షి రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతూ మహేష్ స్టామినాను మరోసారి ప్రూవ్ చేస్తోంది. అయితే ఈ సినిమా దెబ్బతో మహేష్ మూటా ముల్ల సర్దేసుకుని వెళ్లిపోతున్నాడు.

కంగారు పడకండి.. మహేష్ ఏమీ దేశం వదిలి శాశ్వతంగా వెళ్లిపోవడం లేదు. మనోడు సినిమా టు సినిమా మధ్యలో హాలీడేలు ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు కూడా ఇదే దారిలో మహర్షి సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో మహేష్ లాంగ్ హాలీడేస్‌ ప్లాన్ చేసి వెళుతున్నాడు. తన ఫ్యామిలీతో కలిసి లాంగ్ టూర్‌కు వెళ్లేందుకు మహేష్ రెడీ అయ్యాడు. సెలవులు గడిపిన తరువాత మళ్లీ తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతాడు.

దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో‌ తన నెక్ట్స్ మూవీని రెడీ చేస్తున్న మహేష్ ఈ చిత్రం షూటింగ్‌ను జూన్ నెలాఖరున స్టార్ట్ చేయనున్నాడు. ఇక ఈ సినిమా టోటల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించేందుకు అనిల్ రావిపూడి రెడీ అవుతున్నాడు.

Leave a comment