GossipsRRRలో స్వీటీ ఝలక్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

RRRలో స్వీటీ ఝలక్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ RRR మూవీ కోసం యావత్ ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో భారీ తారాగణం ఈ సినిమాకే హైలైట్‌గా నిలవనుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది. ఈ సినిమాలో తారక్, చరణ్‌లతో పాటు పలువురు స్టార్ యాక్టర్లు నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాలో బాహుబలి యాక్టర్ ప్రభాస్ తన వాయిస్ ఓవర్ ఇవ్వడంతో పాటు ఓ స్పెషల్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి తోడు బాహుబలి హీరోయిన్ అనుష్క శెట్టి కూడా ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. అమ్మడి పాత్ర ఈ సినిమాలో ఏకంగా 3-4 నిమిషాల పాటు ఉంటుందని.. ఆమె పాత్ర సినిమాలో చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుందని తెలుస్తోంది.

ఈ విషయం తెలుసుకున్న స్వీటీ ఫ్యాన్స్‌ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. స్టార్ బ్యూటీ ఈ సినిమాలో ఎలాంటి రోల్ చేస్తుందా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అమ్మడి ఫ్యాన్స్. ఇక తారక్,చరణ్‌ ఫ్యాన్స్‌ అయితే ఈ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news