చిరు కోసం ఐటం గా మరీనా అనుష్క..?

స్టార్ సినిమాలకు ఎన్ని కమర్షియల్ హంగులు ఉన్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఓ సాంగ్ ఉండాల్సిందే. ఆ సాంగ్ తో సినిమాకు మరింత ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేయాలని చూస్తారు. అందుకే సినిమాల్లో ఐటం సాంగ్స్, స్పెషల్ సాంగ్స్ కు ఓ క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు ఇలాంటి సాంగ్స్ కోసం సెపరేట్ గా కొంతమంది ఉండేవారు కాని ఇప్పుడు హీరోయిన్స్ నే ఐటం సాంగ్స్ కు వాడేస్తున్నారు. స్పెషల్ సాంగ్ లో హీరోయిన్ అయితే మరింత స్పెషల్ గా ఉంటుందని దర్శక నిర్మాతల నమ్మకం.

అదే ఫార్ములాని కొనసాగిస్తున్నారు అందరు స్టార్. అయితే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలో కూడా ఈ స్పెషల్ సాంగ్ అవసరమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమాలో నయనతార, తమన్నా నటిస్తున్నారు. వీరు చాలరు అన్నట్టుగా స్వీటీ అనుష్కతో సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో అనుష్క ఉంది అంటే అదో క్రేజ్ అన్నట్టే. చిరుతో స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన అనుష్క మళ్లీ 13 ఏళ్ల తర్వాత సైరాలో కూడా స్పెషల్ సాంగ్ లో నర్తిస్తుంది.

భాగమతి తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చిన అనుష్క కోనా వెంకట్ నిర్మాణంలో సీక్రెట్ సినిమా చేస్తుంది. ఈ సినిమాలో అనుష్కతో పాటుగా మాధవన్ కూడా నటిస్తున్నాడు. సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకు రానివ్వకుండా సీక్రెట్ గా సినిమా షూటింగ్ చేస్తున్నారు. మరి చూస్తుంటే మళ్లీ అనుష్క వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యినట్టే అని చెప్పొచ్చు.

Leave a comment