Gossipsపాపం బెల్లంకొండ అబ్బాయికి దెబ్బమీద దెబ్బ..!

పాపం బెల్లంకొండ అబ్బాయికి దెబ్బమీద దెబ్బ..!

టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు శీను’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా స్టార్ డైరెక్టర్..స్టార్ హీరోయిన్..స్టార్ నటులు ఉండటంతో మనోడికి బాగా కలిసి వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత ఇక బెల్లంకొండ అబ్బాయికి తిరుగు లేదు అనుకున్న సమయంలో వరుస డిజాస్టర్లతో సతమతమవుతూ వస్తున్నాడు. ఈ మద్య తేజ దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా వచ్చిన ‘సీత’మూవీలో హీరోగా నటించాడు.

ఈ సినిమా కూడా మనోడిని ఏమాత్రం ఆదుకోలేక పోయింది. ‘కవచం’ పెద్ద ఫ్లాప్ కావడంతో కమర్షియల్ కథలకు కాస్త దూరంగా జరిగి ‘సీత’ సినిమాను ఓకే చేశాడు. ఈ సినిమాలకు తొలిరోజు వచ్చే కలెక్షన్స్ ‘సీత’ సినిమాకు మూడు రోజుల్లో వచ్చాయి.

దీన్ని బట్టి చూస్తుంటే అతడి సినిమాలకు ఆడియన్స్ లో ఆసక్తి ఎంతగా తగ్గిందో తెలుస్తోంది. కాజల్ లాంటి స్టార్ హీరోయిన్, తేజ లాంటి డైరెక్టర్ ఉన్నప్పటికీ ఈ సినిమాకు కనీసపు ఓపెనింగ్స్ కూడా రాలేదు.

బెల్లంకొండ మార్కెట్ ని పెంచడం కోసమే ఇలా చేసేవారు. అయితే ఇప్పుడు ఆ మార్కెట్ ని మరింత కిందకి పడిపోయేలా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. దాదాపు పదమూడు కోట్లు వసూళ్లు రాబట్టాల్సిన ఈ సినిమా సగానికి పైగా మొత్తాన్ని పోగొట్టుకోనుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news