డైలామాలో పడ్డ మన్మధుడు..

కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మన్మధుడు 2’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యాక్టర్ నుండి డైరెక్టర్‌గా మారిన రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాతో నాగ్ మరోసారి కమ్‌బ్యాక్ కావాలని చూస్తు్న్నాడు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ నటిస్తుండటంతో.. అమ్మడి స్లిమ్ లుక్ నాగ్‌కు ఏమాత్రం నచ్చడం లేదు. ఇదిలా ఉంటే.. మన్మధుడు చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేశారు. కానీ.. దసరాకు పెద్ద సినిమాలు లైన్ కట్టడం.. ఆగష్టు నెలలో సాహో చిత్రం ఉండటంతో మన్మధుడు 2 రిలీజ్ ఎప్పుడా అని చిత్ర యూనిట్ తీవ్రంగా ఆలోచిస్తున్నారు. చివరకు మన్మధుడు-2 చిత్రాన్ని జూలై చివరి వారంలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయినట్లు తెలుస్తోంది.

అందుకే ఈ సినిమా షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్నారు చిత్ర యూనిట్. నాగ్ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరి జూలై చివరి వారంలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a comment