కన్నీళ్లు పెట్టుకున్న ఫోర్న్ స్టార్..?

ఫోర్న్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీలియోన్ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తన హవా చాటుకుంది. ప్రస్తుతం ఇక్కడ అవకాశాలు బాగా పెరగడంతో తన ఫోర్న్ మూవీస్ కి పులిస్టాప్ పెట్టేసింది. ఒక్క హిందీలోనే కాకుండా అనేక భాషల్లో నటిస్తూ తన సత్తా చాటుకుంటోంది. అయితే ఆమె ఫోర్న్ సినిమాలకు బంద్ చెప్పినా ఇంకా దానికి సంబందించిన అవమానాలు ఆమెకు ఇప్పుడు ఎదురవ్వడం ఇబ్బందికరంగా మారింది.

ఇంతకీ విషయం ఏంటి అంటే బాలీవుడ్ స్టార్, కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ నిర్వహిస్తున్న “పింక్” అనే టాక్ షోకు సన్నీ హాజరైంది. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై నెటిజన్లు చేసే కామెంట్లు, వారి ప్రశ్నలపై చర్చ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్ గురించి సన్నీ వద్ద అర్భాజ్ ప్రస్తావించారు. దీంతో సన్నీ భోరున విలపించింది. అర్భాజ్ ఓదార్చుతున్నా ఆమె ఆగలేదు.

పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని గడుపుతున్న సమయంలో కూడా పాత విషయాలనే అడుగుతూ.. తనను మానసిక ఆవేదనకు గురిచేస్తూ, అవమానాలకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతం అయ్యింది.

Leave a comment