దేవదాస్ సెంటిమెంట్ వదలని అక్కినేని ఫ్యామిలీ..!

ఏయన్నార్ ఆల్ టైం క్లాసిక్ హిట్స్ లో ఒకటైన దేవదాస్ సినిమా గురించి తెలియని తెలుగు సిని ప్రేక్షకుడు ఉండడు. విరహ వేదనతో ఓ ప్రేమికుడు పడే తపనని ఏయన్నార్ అచ్చు గుద్దినట్టు చూపించారు. అయితే చాలా గ్యాప్ తర్వాత అదే టైటిల్ తో దేవదాస్ అని నాగార్జున ఓ సినిమా చేశాడు. అందులో నాని కూడా నటించాడు. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేదు. అయితే అయినా సరే దేవదాస్ సెంటిమెంట్ ను వదలట్లేదు అక్కినేని ఫ్యామిలీ.

బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ నాగ చైతన్య కోసం ఓ కథ సిద్ధం చేశాడట. దాదాపు ఇది దేవదాస్ కథకు దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది. దేవదాస్ సెంటిమెంట్ అక్కినేని ఫ్యామిలీకి కలిసి వచ్చింది. అందుకే ఆ టైటిల్ తోనే మళ్లీ ఈ సినిమా చేస్తారని అంటున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలో ఈ సినిమా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందట. దేవదాస్ సినిమా ఏయన్నార్ కు చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.

కచ్చితంగా చైతుకి రాబోతున్న ఈ సినిమా మంచి పేరు తెచ్చి పెడుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మజిలి సినిమా చేస్తున్న చైతన్య తర్వాత ఈ సినిమానే చేస్తాడని అంటున్నారు. విజయేంద్ర ప్రసాద్ కథ మాత్రమే అందిస్తారా లేక ఆయన ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

Leave a comment