మహర్షిలో s/0 మహేష్ ..?

ఎన్నో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న మిల్క్ బాయ్ మహేష్ చిత్రం ‘ మహర్షి ‘ కి సంబంధించి రోజుకో అప్డేట్ బయటకి వస్తూ ఫ్యాన్స్ ని ఉత్సాహపరుస్తోంది. మహేష్ 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోంది.ఈ సినిమా ను మహేష్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాడు.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా పూర్తి స్థాయి ఎమోషనల్ మూవీ గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా లో కామెడీ హీరో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.అయితే ప్రస్తుతం వస్తున్న అప్ డేట్ ఏంటి అంటే …?
మహర్షి సెట్స్ లో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కనిపిస్తుండడం ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. అయితే సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో గౌతమ్ కనిపిస్తాడనే టాక్ కొద్దిరోజులుగా ఎక్కువ అయ్యింది.

గతంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన “1 నేనొక్కడినే” సినిమాలో మహేష్ చిన్ననాటి పాత్రలో కనిపించాడు గౌతమ్ కృష్ణ. అయితే ఇప్పుడు ఇంతలకాలం తరువాత తన కొడుకుతో పాటు నటిస్తుండడం నిజగంగా అభిమానులకు పండగే.

Leave a comment