‘ఆర్ఆర్ఆర్’పై సస్పెన్స్ ను తొలగించనున్న రాజమౌళి!

టాలీవుడ్ లో అపజయం ఎరుగని ధీరుడు రాజమౌళి. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలు ఏవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకోలేదు. రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన బాహుబలి, బాహుబలి 2 జాతీయ స్థాయిలో దుమ్మురేపింది. ఎన్నో రికార్డులు కొల్లగొట్టింది. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ లతో మల్టీస్టారర్ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ ఆర్ (వర్కింగ్ టైటిల్) సినిమా అప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వస్తుంది.

అయితే ఈ సినిమా పై ఇప్పటి వరకు ఎన్నో కథనాలు మీడియాలో వస్తున్నాయి. రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ అని, ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని, బాక్సింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుందని, రెండు జన్మల కథని… ఇలా ఎన్నో పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అంతే కాదు ఈ సినిమాలో బాలీవుడ్ భామలు సందడి చేయబోతున్నారని టాక్ వినిపించింది. గతంలో రాజమౌళి సినిమాను ప్రారంభించే రోజే ఆ సినిమాకు సంబంధించిన విశేషాలను రివీల్ చేస్తాడన్న సంగతి తెలిసిందే. ఈగ, బాహుబలి, మర్యాదరామన్న వంటి సినిమాల విషయంలో అదే జరిగింది.

ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయినా, ‘ఆర్ఆర్ఆర్’ గురించి మాత్రం ఏ వివరమూ వెల్లడి కాలేదు. గత కొంత కాలంగా ఆర్ఆర్ఆర్ పై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టే యోచనలో రాజమౌళి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సస్పెన్స్ కు తెరదించుతూ 14వ తేదీన రాజమౌళి మీడియా సమావేశం నిర్వహిస్తారని టాలీవుడ్ వర్గాల నుంచి వార్తలు అందుతున్నాయి. ఒకవేళ మార్చ్ 14 మీడియా మీట్ కన్ఫర్మ్ అయితే ఆ రోజు ఏ విషయాలు షేర్ చేసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.

కోల్ కొతా షెడ్యూల్ తో పాటు ఇప్పటిదాకా జరిగిన ప్రోగ్రస్ ని వివరించి స్టోరీ లైన్ ని సైతం లైట్ గా రివీల్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ మీడియా సమావేశంలో సినిమాకు సంబంధించిన కొంత సస్పెన్స్ వీడిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఈ మీడియా సమావేశం విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.

Leave a comment