నలుగురి జీవితాలు.. ‘చిత్రలహరి’ టీజర్..!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్. ఈ హీరో మొదట నటించిన సినిమా ‘రేయ్’. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యంగా రిలీజ్ అయ్యింది. అదే సమయంలో నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’మంచి సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వచ్చిన సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సూపర్ హిట్ అయ్యాయి. ఆ తర్వాత మనోడికి బ్యాడ్ లక్ మొదలై వరుసగా ఆరు సినిమాలు దారుణమైన ఫలితాలు ఇచ్చాయి. దాంతో తన మేనమామ చిరంజీవి సలహాలు పాటిస్తూ..తదుపరి సినిమాపై జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.

కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో సాయిధరమ్, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథ పెతురాజ్‌ ‘చిత్రలహరి’లో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి హడావుడి లేకుండా నేడు టీజర్ రిలీజ్ చేశారు. అప్పట్లో దూరదర్శన్ లో ఆదివారం రోజున వచ్చే ఓ ప్రోగ్రామ్.. 2019 లో చిత్రలహరి ఫ్రైడే రోజున రిలీజ్ కాబోయే సినిమా.. ఆ సినిమాలోని కొన్ని పాత్రలు అంటూ టీజర్ మొదలవుతుంది. అబ్బాయిలంతా ఒక్కటే.. పరిచయం కాకముందు ఒకలా.. అయ్యాక ఒకలా ఉంటారనే అనే ఫీలింగ్ తో ఉండే నివేత… డిస్కస్ చేయాలి.. తెలుసుకోవాలి.. నీడ్ సమ్ టైమ్ అంటూ డైలమాలో ఉండే కళ్యాణి ప్రియదర్శన్ అమాయకత్వంగా చూస్తుంది.

ఇక సునీల్ తనదైన కామెడీ స్టైల్లో కనిపించాడు. నా పేరు విజయ్..నా పేరులో ఉన్న విజయం ఎప్పటికీ..అనగానే కరెంట్ పోతుంది. బాదపడకు బాబాయ్..నీకో మంచి రోజు వస్తుంది..ఆ వచ్చేదేదో ఆదివారం పూట రమ్మను ఇంటిదగ్గర ఖాలీగా ఉంటా అంటూ సాయిధరమ్ డైలాగ్..ఈ సినిమా నలుగురి జీవితాల మద్య సాగేలా కనిపిస్తుంది. మరి ఈ సినిమా సాయి ధరమ్ కి కలిసి వస్తుందో లేదో చూడాలి.

Leave a comment