హిట్ అయినా కలెక్షన్లు కష్టం ?

టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ జంట ఎవరంటే..వెంటనే చెబుతారు సమంత, అక్కినేని నాగ చైతన్య. ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏం మాయ చేసావే సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఈ జంట తర్వాత ఆటోనగర్ సూర్య, మనం సినిమాల్లో నటించారు. మనం సినిమా తర్వాత ఇరు కుటుంబ పెద్దలను ఒప్పటించి రెండు సాంప్రదాయాల ప్రకారం పెళ్లి చేసుకున్నారు.

వివాహం తర్వాత సమంత నటించిన సినిమాలు వరుస విజయాలు సాధించాయి. కానీ నాగ చైతన్య నటించిన సినిమాలు మాత్రం డిజాస్టర్ అయ్యాయి. తాజాగా నిన్ను కోరి ఫేమ్ శివ దర్శకత్వంలో ‘మజిలీ’సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి టీజర్, లిరికల్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తున్నాయి. ఈ మూవీ ఏప్రిల్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎలాగూ సమ్మర్ సీజన్ విద్యార్థులకు పరీక్షలు కూడా పూర్తవుతున్నాయి..దాంతో సినిమా హిట్ టాక్ వస్తే కలెక్షన్లు కూడా భారీగానే వస్తాయని చిత్ర యూనిట్ భావించింది.

కానీ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన ఎన్నికల తేదీతో మజిలీ కొత్త కష్టాలు మొదలు అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఈ ఎన్నికల ఎఫెక్ట్ ‘మజిలీ’పై పడితే మాత్రం కలెక్షన్ల విషయంలో ఢీలా పడాల్సి వస్తుందని చిత్ర యూనిట్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Leave a comment