ఆర్ఆర్ఆర్ కి కలకత్తాలో కొత్త ట్విస్ట్..

టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలకు నాంది పలికిన సినిమా ‘బాహుబలి’సీరీస్. రాజమౌళి ఐదు సంవత్సరాలు కష్టపడి తీసిన ఈ సినిమా జాతీయ స్థాయిలో పెను సంచలనాలు సృష్టించింది. ప్రపంచ దేశాల్లో టాలీవుడ్ లో ఈ రేంజ్ సినిమాలు కూడా తీస్తారా అని ఆశ్చర్యపోయే విధంగా బాహుబలి, బాహుబలి 2 తెరకెక్కించారు. ఈ సినిమాలతో ప్రభాస్ రేంజ్ జాతీయ స్థాయిలో పెరిగిపోయింది.

ఈ సినిమా తర్వాత దాదాపు సంవత్సరం విరామం తీసుకున్న రాజమౌళి మరో అద్భుతాన్ని సృష్టించేందుకు సన్నద్దం అయ్యారు. టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా మంచి క్రేజ్ లో ఉన్న ఎన్టీఆర్, రాంచరణ్ లతో మల్టీస్టారర్ సినిమా తీస్తున్నారు. ఈ సినిమా షెడ్యూల్ కూడా మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ .. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను .. చరణ్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

ఈ షెడ్యూల్ పూర్తి కాగానే.. కోల్ కతాలో తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా చెబుతున్నారు. అక్కడ 40 రోజుల పాటు జరిగే షెడ్యూల్ లో ఎన్టీఆర్, రాంచరణ్ ల మద్య కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించబోతున్నట్లు సమాచారం. అక్కడ అవుట్ డోర్లో తీస్తారా? లేకపోతే ఎక్కడైనా భారీ సెట్స్ వేశారా? అనేది తెలియాల్సి వుంది. ఈ సినిమాలో అలియా భట్, పరిణీతి చోప్రా పేర్లు వినిపిస్తున్నాయి.

Leave a comment