వాయిదాలతో విసిగించేస్తున్న ‘మహేష్’..!

మిల్క్ బాయ్ మహేష్ నటిస్తున్న ‘ మహర్షి’ సినిమా మీద అభిమానులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆశగా ఎదురుచూపులు చూస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ… మహేష్ అభిమానులకు విసుగు తెప్పిస్తోంది. ఇప్పటికే అనేక రిలీజ్ డేట్స్ ప్రకటించి మళ్ళీ వాయిదాలు వేసుకుంటూ రావడంపై ఆ చిత్ర యూనిట్ పై మండిపడుతున్నారు.

ఏప్రిల్ 5న విడుదల కావలసిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల అదే నెల 25కి వాయిదా పడింది. అ రోజున ఈ సినిమా తప్పనిసరిగా విడుదలవుతుందని ఆ చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఆ తేదీని కూడా వాయిదా వేసినట్టు నిర్మాత దిల్ రాజు తన ట్విటర్ లో పేర్కొన్నారు. అయితే ఈ చిత్రాన్ని మే 9న రిలీజ్ చేయబోతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పీవీపీ సినిమా పతాకాలపై సి. అశ్వనీదత్‌, ‘దిల్‌’ రాజు, ప్రసాద్‌ వి. పొట్లూరి (పివిపి) సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

‘మహర్షి’ మహేష్ 25వ చిత్రం కావడంతో చాలా జాగ్రత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించే పనిలో పడ్డాడు ఈ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి. అన్నట్టు ఈ చిత్రంలో మహేష్ స్నేహితుడిగా.. అల్లరి నరేష్ నటిస్తుండగా… పూజ హెగ్డే హీరోయిన్.
maharshi

Leave a comment