మళ్ళి ముదిరిన ప్రేమ వ్యవహారం ..?

తమిళ ఇండస్ట్రీలో ఎప్పుడు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే శింబు..గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన శింబు తర్వాత హీరోగా మారారు. హీరోగా కెరీర్ బిగినింగ్ లో నయనతార తో డీప్ లవ్ లో ఉన్న మనోడు లిప్ లాక్ తో సోషల్ మీడియాలో సంచలనాలకు తెరలేపాడు. ఆ తర్వాత బాలీవుడ్ నటి హన్సికతో ప్రేమాయణం కొనసాగించాడు. బాలీవుడ్ లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన హన్సిక తర్వాత పూరి జగన్నాధ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘దేశముదురు’చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

సర్వసాధారణంగా సినీ ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం బ్రేకప్ చేప్పుకోవడం చూస్తూనే ఉన్నాం. కొంత మంది సినీ నటులు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. గతంలో శింబు, హన్సిక కొంత కాలం ప్రేమాయణం కొనసాగించిన తర్వాత వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ప్రస్తుతం హన్సిక ఎక్కువగా తమిళ మూవీస్ లోనే నటిస్తుంది. హన్సిక ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న తమిళ చిత్రం ‘మహా’. ఇది ఆమెకు 50వ మూవీ. ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదలై సినిమాకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. కొన్ని కాంట్రవర్సీలు కూడా వచ్చాయి.

అయితే చాలా కాలం తర్వాత హన్సిక నటిస్తున్న మహా మూవీలో హీరో శింబు ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు హన్సిక తెలిపింది. ‘అనుకున్న సమయం కన్నా ముందే న్యూస్ లీకైంది. నేను, శింబు ‘మహా’లో మళ్లీ కలిసి నటిస్తున్నాం’ అంటూ హన్సిక ట్వీట్ చేసింది. ఇప్పుడు శింబు, హన్సికల క్రేజీ కాంబినేషన్‌తో మరోసారి హాట్‌ టాపిక్‌గా మారింది. చాలా కాలం తర్వాత తెరపై ఈ జంటను చూస్తే ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a comment