ఎన్టీఆర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన జ్యోతి..!

యంగ్ డైనమిక్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మీద ఎప్పుడూ… ఏదో ఒక సెన్సేషనల్ అప్ డేట్స్ వస్తూనే ఉంటాయి. వరుస వరుస హిట్లతో ఎప్పడూ… ఫామ్ లో ఉంటూ… క్రేజ్ అమాంతం పెంచుకునేపనిలో ఉంటున్నాడు జూనియర్. ప్రస్తుతం దర్శక బాహుబలి రాజమౌళి డైరెక్షన్ లో చెర్రీ తో కలిసి నటుస్తున్న ఎన్టీఆర్ పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గ్లామర్ టచ్ ఉండే పాత్రల్లో నటిస్తూ… మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి జ్యోతి అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.

జ్యోతి తెలుగు బిగ్ బాస్ 1 సీజన్ లో కంటెస్టెంట్ గా సందడి చేసిన సంగతి అందరికి తెలిసిందే. మరి కొన్ని నెలల్లో బిగ్ బాస్ 3 కూడా ప్రారంభం కాబోతోంది. ఈ సందర్భంగా జ్యోతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ షో కి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. బిగ్ బాస్ 1తో పోల్చుతూ బిగ్ బాస్ 2పై సంచలన వ్యాఖ్యలు చేసింది.తనకు బిగ్ బాస్ 1లో అవకాశం దక్కిందని… కానీ అదే ఛాన్స్ బిగ్ బాస్ 2లో కూడా వచ్చి ఉంటే బావుండేది అంటూ జ్యోతి తెగ బాధపడిపోతోంది. బిగ్ బాస్ 2లో కంటెస్టెంట్స్ కు చాలా ఫ్రీడమ్ కల్పించారని కానీ తనకు ఆ అవకాశం దక్కకపోవడంతో తాను చాలా నిరాశపడినట్టు చెప్పుకొచ్చింది.

బిగ్ బాస్ 1లో హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ అంటే ప్రతి ఒక్కరికి భయం ఉండేది. ఎన్టీఆర్ వస్తుంటే ఆ హుందాతనమే వేరుగా ఉండేది. ఎన్టీఆర్ ఎప్పుడొచ్చి ఏం మాట్లాడతాడో అని అంతా వణికిపోయేవారు. కానీ బిగ్ బాస్ గా ఎన్టీఆర్ సంపూర్ణ న్యాయం చేసి హుందాగా వ్యవహరించారు అంటూ ప్రశంసల వర్షం కురిపించింది. ఇక బిగ్ బాస్ 3 గురించి మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ఈ షోకి సంబంధించిన కొన్ని విషయాలు తనకు తెలిశాయని జ్యోతి తెలిపింది. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ గా వరుణ్ సందేశ్, ఉదయభాను, చార్మి పేర్లు వినిపిస్తున్నాయని జ్యోతి తెలిపింది.

Leave a comment