ఇక డైరెక్షన్ లోకి మాస్ రాజా..?

ఇడియట్ సినిమా హీరోగా పరిచయం అయిన మాస్ మహరాజ రవితేజ ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. పవర్ సినిమా తర్వాత కిక్ 2, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలు డిజాస్టర్ కావడంతో మనోడు ఏకంగా రెండు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చాడు. దాంతో ఇక రవితేజ కెరీర్ ముగిసి పోయినట్లే అనుకున్న సమయంలో అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ సినిమాలో తన మాస్ పవర్ ఏంటో చూపించాడు.

ఈ సినిమాతో వరుస విజయాలు అందుకుంటాడనుకున్న రవితేజ వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు. ప్ర‌స్తుతం వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ డిస్కో రాజా అనే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంతో పాటుగా తమిళ హిట్ ‘తేరి’కి రీమేక్‌గా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాకు కనక దుర్గ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం.

న‌టుడిగా సినిమాలు చేస్తూనే ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేయాల‌ని ర‌వితేజ భావిస్తున్నాడ‌ని తెలుస్తుంది. ఈ మద్య తన వద్ద ఉన్న కథ నందమూరి కళ్యాన్ రామ్ కి వినిపించగా కథ నచ్చడంతో సొంత బ్యానర్ లో తానే హీరోగా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. ర‌వితేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. క‌ళ్యాణ్ రామ్ నిర్మాణంలో ర‌వితేజ కిక్ 2 అనే చిత్రం చేసిన సంగ‌తి తెలిసిందే.

Leave a comment