భయపెడుతూనే వసూలు చేసిన కాంచన..

తమిళ నటుడు కమ్ దర్శకుడు రాఘవ లారెన్స్ మరోసారి భయపెట్టేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ముని, కాంచన, గంగ అంటూ వరుసబెట్టి సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను భయపెట్టాడు. కాగా తాజాగా మరోసారి ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు రెడీ అయ్యాడు మన రాఘవ. అయితే ఈసారి కేవలం భయపెట్టడమే కాకుండా ఏకంగా వసూళ్లు కూడా చేస్తున్నాడు.

లారెన్స్ నటిస్తోన్న తాజా చిత్రం కాంచన 3 విడుదలకు సిద్ధమౌతోంది. కాగా ఈ సినిమాను తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాడు లారెన్స్. అయితే తమిళంలో సన్ పిక్చర్స్ వారు ఈ సినిమాను రిలీజ్ చేస్తోండగా.. తెలుగులో లారెన్స్ స్వయంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. కాగా తెలుగులో ఈ సినిమా హక్కులు ఏకంగా రికార్డు స్థాయిలో రూ.12 కోట్లకు అమ్ముడయ్యాయి.

లారెన్స్ నటించిన చిత్రాల్లో ఈ చిత్రం రైట్స్ అత్యంత ఎక్కువ రేటుకు అమ్ముడు కావడం విశేషం. ఇక హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న కాంచన 3 సినిమాను లారెన్స్ స్వయంగా డైరెక్ట్ చేస్తూ నటిస్తుండగా.. వేదిక, ఓవియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.

Leave a comment