ముద్దు సీన్‌పై రష్మికను ఆడుకుంటున్న ఆ హీరో ఫ్యాన్స్

ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అందాల బ్యూటీ రష్మిక మందన్న ఆ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. ఇక ఆ సినిమా తరువాత విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘గీత గోవిందం’ అమ్మడికి ఎదురులేకుండా చేసింది. కేవలం హిట్ చిత్రంగా నిలవడమే కాకుండా గీత గోవిందం కమర్షియల్‌ బ్లాక్ బస్టర్‌గా నిలిచి రష్మికకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆ సినిమా ఆమె వ్యక్తిగత జీవతంలో కొంతమేర చేదు మిగిల్చింది.

గీత గోవిందం రిలీజ్‌కు ముందే ఆ సినిమాలో ఉన్న అరకొర లిప్ లాక్ సీన్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ కావడంతో రష్మికపై కన్నడ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. వారు ఫైర్ కావడానికి కారణం కూడా ఉందండోయ్.. అప్పట్లోనే రష్మిక నిశ్చితార్థం కన్నడ నటుడు రక్షిత్‌‌తో జరిగిపోయింది. అయితే గీత గోవిందం సినిమా టైమ్‌లో మనస్పర్థ కారణంగా తన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుని రక్షిత్‌తో బ్రేకప్ చేసుకుంది ఈ పాప. అయితే రష్మికపై ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయొద్దని అప్పట్లో రక్షిత్ తన ఫ్యాన్స్‌ను కోరాడు. కట్ చేస్తే.. ఇప్పుడు అదే విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక ‘డియర్ కామ్రేడ్’ అంటూ మరోసారి రెచ్చిపోయింది.

ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదల కాగా.. అందులో వారిద్దరి మధ్య ఓ ఘాటైన లిప్‌‌లాక్ ఉంది. దీంతో రక్షిత్ ఫ్యాన్స్ రష్మికను సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు. నీకు ఆ ముద్దు సీన్ అవసరమా పాప.. అంటూ రష్మికపై నెగెటివ్ కామెంట్స్ చేస్తూ అమ్మడిని తెగ ట్రోల్ చేస్తున్నారు. పాపం రష్మిక.. ఈ దెబ్బతో ఎలా రియాక్ట్ అవుతుందా అని మూవీ క్రిటిక్స్ వెయిట్ చేస్తున్నారు.

Leave a comment