బిగ్ బాస్ కి తారక్ షాక్ ..?

‘బిగ్ బాస్’ తెలుగులో ఈ రియాలిటీ షో కి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది. బిగ్ బాస్ 1 కి తారక్ హోస్ట్ గా వ్యవహరించడంతో ఎక్కడలేని ప్రాధాన్యం వచ్చేసింది. అసలు ఎన్టీఆర్ బిగ్ బాస్ లో నటించడమే పెద్ద సంచలనం అయ్యింది. కాకపోతే బిగ్ బాస్ సీజన్ 1 హిట్ అయినా సీజన్ 2 లో నటించేందుకు ఎన్టీఆర్ ఆసక్తి చూపించలేదు. దీనికి కారణం ఆయన అరవింద సమేత సినిమా షూటింగ్ లో తీరిక లేకుండా ఉండడం వల్లనే.

ఎన్టీఆర్ ఆ విధంగా తప్పుకోవడంతో ఆ షో నిర్వాహకులు హీరో నానితో రెండో సీజన్ హోస్ట్ చేయించారు. కాకపోతే సీజన్ 1 కి వచ్చిన రేంజ్ లో సీజన్ 2 కి రేటింగ్స్ రాకపోయినా ఆ షో కి కూడా మంచి పేరే వచ్చింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే సీజన్ 2 కి కూడా మంచి పేరే వచ్చినా సీజన్ 3 లో నటించేందుకు నాని కూడా నో చెప్పడం. దీంతో మల్లి ఈ షో నిర్వాకుల కన్ను ఎన్టీఆర్ మీద పడింది. ఏదో ఒక రకంగా ఎన్టీఆర్ తో షో చేయించాలనే ప్రయత్నాలు ప్రారంభం అవ్వగా దానికి ఎన్టీఆర్ నో చెప్పాడట.

దీనికి కారణం కూడా లేకపోలేదు. ప్రస్తుతం తారక్ రాజమౌళి దర్శకత్వం లో ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. ఏప్రిల్ నుంచి మేజర్ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ బిజీ వల్లే సీజన్ 3 లో నటించేందుకు వెనకడుగు వేస్తున్నాని సున్నితంగా ఆ షో నిర్వాహకులకు ఎన్టీఆర్ నచ్చచెప్పాడట. బిగ్ బాస్ లో హోస్ట్ గా చేయాలని ఎన్టీఆర్ కి ఉన్నప్పటికీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆ విధంగా సమాధానం చెప్పాడట.

Leave a comment