ఏ దిక్కు లేక.. మళ్లీ అతడితోనే కానిస్తున్న బ్యూటీ!

టాలీవుడ్‌లో అవకాశాలు ఉన్నప్పుడే స్టార్ స్టేటస్ అనుభవించవచ్చు అనే దానికి పర్ఫెక్ట్ ఉదాహరణగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నిలిచింది. ఒకప్పుడు వరుసబెట్టి సినిమాలు చేస్తూ సక్సెస్‌లో పీకల్లోతూ మునిగిన ఈ బ్యూటీ.. తప్పుడు సెలెక్షన్లతో ఫ్లాపులను మూటగట్టుకుని ఆఫర్లు లేక వచ్చిన సినిమాను చేస్తూ కాలం వెల్లబుచ్చుతోంది. అయితే తెలుగులో కంటే కూడా అమ్మడికి తమిళంలో ఆఫర్లు వస్తున్నాయి. కానీ తెలుగులో మరోసారి బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తోంది రకుల్.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రకుల్ త్వరలో ఓ మెగా హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యిందట. అయితే అతడేమీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తున్న హీరో కాదులెండీ. వరుస ఫెయిల్యూర్స్‌తో సక్సెస్ గ్రాఫ్ పడిపోయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ నటించబోయే కొత్త సినిమాలో రకుల్ హీరోయిన్‌గా నటించనుందట. వీరిద్దరు కలిసి ఇప్పటికే ‘విన్నర్’ అనే అమృతాంజన్ బామ్ సినిమాను మనమీదకు వదిలారు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి ఎలాంటి సినిమాతో వస్తారా అని తెలుగు ఆడియెన్స్ కాస్త భయపడుతున్నారు.

ఇక సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రలహరి షూటింగ్ ఇప్పటికే పూర్తవ్వగా.. రిలీజ్‌కు రెడీ అవుతోంది. అటు రకుల్ కూడా సాయి ధరమ్ తేజ్‌తో సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆతృతగా ఎదురుచూస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment