ఆర్ ఆర్ ఆర్ లో ఎన్టీఆర్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తూ… ఆయన అభిమానులకు పండుగ చేస్తూ ఉంటాయి. సినిమాలో కథ, కథనం ఎలా ఉన్నా… పాత్ర చుట్టూ అల్లుకుపోవడం … బంపర్ హిట్ కొట్టడం ఎన్టీఆర్ కి కొత్తేమి కాదు. అందుకేనేమో ఆయనకు యూత్ లో అంత క్రేజ్. ఇక ఇప్పుడు యంగ్ రాముడు జక్కన్న డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో చెర్రీతో కలిసి నటిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు రామ్ చరణ్ తో షెడ్యూల్ పూర్తి చేసిన రాజమౌళి ఇక యంగ్ టైగర్ తో సీన్లు తీయడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికే కొంత భాగం హైదరాబాద్ లో పూర్తి చేయగా మిగతా భాగం కలకత్తాలో స్టార్ట్ చేశారట. ఇక్కడే ఎన్టీఆర్ కి సంబంధించి కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించేందుకు సిద్ధం అవుతున్నారు.

ఇక ఇక్కడ షూటింగ్ ముగియగానే చెర్రీతో కలిసి నటించే సీన్లు తీస్తారట. 2020 నాటికి ముస్తాబవుతున్న ఈ చిత్రం ఎన్ని రికార్డులు తిరగరాసే దిశగా ముందుకు వెళ్తుందో చూడాలి. రాజమౌళి మీద నమ్మకం … టాప్ యంగ్ హీరోలయిన రాంచరణ్, ఎన్టీఆర్ ల క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా మీద అందరి అంచనాలు పెరిగిపోతున్నాయి.

Leave a comment