రాజ్ తరుణ్ కి మరోసారి కలిసొచ్చింది..!

టాలీవుడ్ లోకి ఉయ్యాల-జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్ తర్వాత నటించిన సినిమా చూసిస్త మావా, కుమారి 21 ఎఫ్, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, అందగాడు సినిమాలో మంచి విజయాన్ని అందుకున్నాయి. ఆ తర్వాత నటించిన సినిమాలు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేదు. గత యేడాది దిల్ రాజు బ్యానర్ లో ‘లవర్’సినిమాలో నటించాడు. కానీ ఈ సినిమా అంచనాలన్నీ తలకిందులు చేశాయి.

అయితే రాజ్ తరుణ్ మాత్రం మరోసారి దిల్ రాజ్ బ్యానర్ లో మరో ఛాన్స్ దక్కించుకున్నాడు. సాధారణంగా దిల్ రాజు యంగ్ హీరోలకు ఎక్కువగా అవకాశం ఇస్తుంటారు..ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ రెండోసారి ఛాన్స్ దక్కించుకోవడం లక్కీ అంటున్నారు ఫిలిమ్ వర్గాలు. ‘ఆడు మగాడ్రా బుజ్జి’ ఫేమ్ కృష్ణారెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ సినిమాకి ‘నీది నాది ఒకటే లోకం’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

ఈ నెల 3వ వారంలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నారు. కథా పరంగా ఈ సినిమా చాలా అద్బుతంగా ఉండబోతుందని..ఈ సినిమాతో మంచి విజయం అందుకుంటానన్న ధీమాలో ఉన్నాడు రాజ్ తరుణ. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment