‘మా’కు మద్దతుగా ప్రభాస్..!

టాలీవుడ్ కి అనుసంధానంగా ఉంటూ వస్తున్న మా అసోసియేషన్ లో శివాజీ రాజా టర్మ్ అయిపోయింది. మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా ఆయన పిరియడ్ లో ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నారు. అయితే మొదటి నుంచి శివాజిరాజాకు మా అసోసియేషన్ కి సొంత భవనం నిర్మించాలనే కోరిక ఉండేది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌కి సొంత భ‌వ‌నం ఇప్పటి వ‌ర‌కూ లేదు. ‘మా హయాంలో సొంత భ‌వ‌నం నిర్మిస్తాం..’ అంటూ చాలామంది హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్క‌రూ నెర‌వేర్చ‌లేక‌పోయారు.

తన పిరియడ్ లో మా కి సొంతభవనం నిర్మించాలనే తాపత్రయంతో మ‌హేష్ బాబు తో అమెరికాలో ఓ ప్రోగ్రాం నిర్విహించాల‌ని, ఆ డ‌బ్బుతో నిధిని పెంచుకోవాల‌ని చూశారు. అయితే కార్యాచ‌ర‌ణ‌లో లోపం వ‌ల్ల మ‌హేష్ పోగ్రాం ర‌ద్దు అయిపోయింది. ఈ నెల 10న ‘మా’ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఆ త‌ర‌వాత కొత్త అధ్య‌క్షుడు ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారు. పోటీలో ఉన్న నరేష్, శివాజీరాజా ఎవరైనా సరే వచ్చే యేడాది వరకు భవన నిర్మాణం ప్లాన్ లో ఉన్నారు. శివాజీ రాజా – న‌రేష్‌ల‌లో ఎవ‌రో ఒక‌రు ‘మా’ అధ్య‌క్షుడిగా ఎన్నిక‌వుతారు.

అయితే ఎవ‌రు పీఠ‌మెక్కినా.. ఈ యేడాది విదేశాల్లో `మా` ఓ భారీ షోని నిర్వ‌హించ‌బోతోంది. అందులో ప్ర‌భాస్ పాల్గొన‌బోతున్నాడు. ప్ర‌భాస్ తో పాటు నాగార్జున‌, వెంక‌టేష్ లాంటి స్టారూ ఈ కార్య‌క్ర‌మంలో పాలుపంచుకుంటారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ జాతీయ స్థాయిలో పెరిగిపోయింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా మనోడిని బాహుబలి అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ని మా అసోసియేష్ సభ్యులు కలిశారు. ప్ర‌భాస్ కూడా ‘మా’ కోసం నిధుల్ని సేక‌రించే బాధ్య‌త తీసుకున్నాడు. మరి ప్రభాస్ కి ఉన్న క్రేజ్ ఎంత వరకు వర్క్ ఔట్ అవుతుందో చూడాలి.

Leave a comment