నేను నోరు విప్పితే జీవితాలు తలకిందులవుతాయి.. ప్రియా ప్రకాశ్ సెన్సేషనల్ కామెంట్స్..!

తన కనుసైగలతో కుర్రాళ్లను వెర్రివాళ్లను చేసిన ప్రియా ప్రకాశ్ వారియర్ ఒరు ఆధార్ లవ్ టీజర్ తో సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. ఆ క్రేజ్ తో ఆ సినిమాను తెలుగులో కూడ లవర్స్ గా రిలీజ్ చేశారు. సినిమా వచ్చింది పోయింది కాని అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఇదిలాఉంటే ఆ సినిమాలో ఆ టీజర్ క్లిక్ అవడం వల్ల సినిమా కథ మార్చారని అప్పటిదాకా తను లీడ్ హీరోయిన్ గా ఉండాల్సింది ప్రియా ప్రకాశ్ ను మెయిన్ హీరోయిన్ చేశారని చెప్పుకొచ్చింది లవర్స్ డే మరో హీరోయిన్ నూరిన్ షరీఫ్.

ఇక మీదట ప్రియా ప్రకాశ్ తో నటించే ఛాన్స్ వచ్చినా వద్దని చెబుతా అన్నది.. అయితే రీసెంట్ గా ఒరు ఆధార్ లవ్ సినిమా దర్శకుడు ఒరు లుల్లూ కూడా ప్రియా ప్రకాశ్ చేయబట్టే తమ సినిమా ఫ్లాప్ అయ్యిందని కామెంట్ చేశాడు. నూరిన్ షరీఫ్ మాటలకు రెస్పాండ్ అవని ప్రియా ప్రకాశ్ దర్శకుడు ఒమర్ లుల్లూ కామెంట్స్ కు మాత్రం రివర్స్ అయ్యింది. తాను నోరు విప్పితే కొందరి జీవితాలు తలకిందులవుతాయని అన్నది. అంతేకాదు ఒరు ఆధార్ లవ్ టైం లో తనకు చాలా అవకాశాలు వచ్చినా ఏ సినిమాను తనని చేయకుండా చేశారని అన్నది.

కొన్ని ప్రశ్నలకు విధి సమాధానం చెబుతుందని అన్నది ప్రియా ప్రకాశ్. అంతా బాగున్నా తాను నోరు విప్పితే జీవితాలు తలకిందులవుతాయని అన్నది.. ఆమె ఏం చెప్పబోతుంది.. దాని వల్ల ఎవరి జీవితాలు తలకిందులవుతాయి అన్నది తెలియాల్సి ఉంది. ఈ కామెంట్స్ తో ప్రియా మళ్లీ హాట్ న్యూస్ గా మారింది.

Leave a comment