పూరి తనయుడితో రొమాన్స్ చేస్తున్న హాట్ బ్యూటీ..!

డైరక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా రొమాంటిక్ అనే సినిమ వస్తుంది. అనీల్ పాదూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఆకాష్ సరసన ఓ హాట్ బ్యూటీ నటిస్తుంది. ఆమె ఎవరు అంటే డబ్ స్మాష్ బ్యూటీ కెతిక శర్మ. కేవల డబ్ స్మాష్ తోనే కాదు అందాలతో కూడా అలరించే కెతిక ఈ లక్కీ ఛాన్స్ అందుకుంది. పూరి కనెక్ట్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ కు తగినట్టుగా హీరో, హీరోయిన్ మధ్య రొమాన్స్ అదిరిపోద్దట.

ఇలాంటి సినిమాలకు అర్జున్ రెడ్డి స్పూర్తిగా నిలిచింది. ఆ సినిమాలో కంటెంట్ తో పాటుగా యువత ప్రస్తుత పోకడలను సరిగా చూపించాడు. పెళ్లి తర్వాత చేయాల్సిన పనులన్ని ప్రేమ పేరుతో కానిచ్చేస్తున్నారు. అదేవిధంగా రొమాంటిక్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా రొమాన్స్ లో రచ్చ చేస్తారని తెలుస్తుంది. తన లుక్స్ తో ఆకట్టుకుంటున్న కెతిక శర్మకు టాలీవుడ్ కరెక్ట్ డెబ్యూ పడిందని అంటున్నారు. మరి నిజంగానే కెతికకు ఈ ఛాన్స్ ఎలాంటి క్రేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.

కెతిక శర్మ హాట్ పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అమ్మడి అందాలకు రొమాంటిక్ సినిమా ఎక్కడికో వెళ్తుందని టాక్. పూరి నిర్మాత కాబట్టి కచ్చితంగా ఈ సినిమా తన స్టైల్ లోనే ఉంటుందని తెలుస్తుంది. ఆకాష్ పూరి, కెతిక శర్మల రొమాన్స్ ఎలా ఉంటుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే.

Leave a comment