కళ్యాణ్ రాం 118 వల్ల లాభపడ్డ మహేష్..!

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో కె.వి.గుహన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా 118. మార్చి 1న రిలీజైన ఈ సినిమా మొదటి షోతో మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా ఫైనల్ కలక్షన్స్ లో ఈ సినిమా కళ్యాణ్ రాం కెరియర్ లో మరో హిట్ సినిమాగా నిలిచిందని తెలుస్తుంది. సినిమాటోగ్రాఫర్ గా ఎంతో అనుభవం ఉన్న గుహన్ 118 సినిమా డైరెక్ట్ చేశారు. ఈ సినిమా 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైంది.

అయితే ఫుల్ రన్ లో ఈ సినిమా 10 కోట్ల వసూళ్లను రాబట్టిందని తెలుస్తుంది. అంటే ఎలా లేదన్నా 4 కోట్ల దాకా లాభాలే. ఇక మరోపక్క శాటిలైట్, డిజిటల్ రైట్స్ కూడా భారీగానే పలికాయట. మొత్తంగా ఈ సినిమా నిర్మాత మహేస్ ఎస్ కోనేరు 118తో మంచి లాభాలు వెనుకేసుకున్నాడని అంటున్నారు. సినిమాలో కళ్యాణ్ రాం కు జోడీగా షాలిని పాండే నటించింది.

నివేదా థామస్ సెకండ్ హీరోయిన్ గా నటించింది. సినిమా మొత్తం నివేదా పాత్ర చుట్టే తిరుగుతుంది. పటాస్ తర్వాత ఒక్క హిట్టు లేని కళ్యాణ్ రాం 118తో విజయం అందుకున్నాడు. మరి ఈ హిట్ మేనియా ఇలానే కొనసాగించాలని ఆశిద్దాం.

Leave a comment