50 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి సిద్ధమైన నటి..!

హాలీవుడ్ నటి, పాప్ సింగర్ జెన్నిఫర్ లోపేజ్ పెళ్లికి సిద్ధమైంది. ఆమె పెళ్లికి సిద్ధమైతే అందులో విశేషం ఏముందు అంటారా ప్రస్తుతం ఆమె వయస్సు 50 సంవత్సరాలు.. అది కూడా ఆమె చేసుకునేది నాల్గవ పెళ్లి అందుకే ఈ వార్త సెన్సేషన్ అయ్యింది. హాలీవుడ్ వాళ్లకు ఇది చాలా కామన్ అనొచ్చు. 50 ఏళ్ల వయసులో జెన్నిఫర్ బేస్ బాల్ వెటరన్ ప్లేయర్ అలెక్స్ రాడ్రిగ్రేజ్ తో రెండేళ్లుగా డేటింగ్ చేస్తుంది జెన్నిఫర్. ఈమధ్యనే వీరి నిశ్చితార్ధం అయ్యిందట.

ఇప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకుని విడాకులు తీసుకున్న జెన్నిఫర్ ఇతనితో అయినా పూర్తి జీవితం పంచుకుంటుందా లేదా అన్నది చూడాలి. జెన్నిఫర్ లోపేజ్ కు 11 ఏళ్ల కవలలు ఉన్నారు. అలెక్స్ కు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. జెన్నిఫర్ కంటే అలెక్స్ కు 6 ఏళ్లు చినవాడని తెలుస్తుంది. పెళ్లి ఎప్పుడు వెన్యూ ఎక్కడ వంటి విషయాలు చెప్పలేదు కాని ఎంగేజ్మెంట్ అయినట్టు మాత్రం వారు అఫిషియల్ గా ట్విట్టర్ లో వెళ్లడించారు.

పాప్ సింగర్ గా జెన్నిఫర్ లోపేజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె నటిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందానికి కేరాఫ్ అడ్రెస్ గా మారిన జెన్నిఫర్ ఇలా మొగుళ్లను మార్చుకోవడం ఓ సరదా అయ్యింది. అలెక్స్ తో అయినా కలిసి ఉంటుందా లేక అతని మీద కొన్నాళ్లకు బోర్ కొడుతుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. అక్కడ వారికి అది అలవాటే కాబట్టి ఆమె ఇదంతా లైట్ తీసుకుంటుంది.

Leave a comment