లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై నందమూరి ఫ్యాన్స్ రియాక్షన్..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ డైరక్షన్ లో లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అంటూ ఓ సినిమా వస్తుంది. ఎన్.టి.ఆర్ అసలు కథ తాను చెబుతా అంటూ వర్మ చేస్తున్న ఈ సినిమాపై రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరెన్ని చెప్పినా.. ఎవరేం చేసినా వర్మ తాను అనుకున్నదే చేస్తాడు. లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ట్రైలర్ చూశాక నిజంగానే వర్మ ఏదో నిజాన్ని చెప్పబోతున్నాడు అని అనుకుంటున్నారు. అయితే వంగవీటి సినిమాను గుర్తు చేసుకుంటే ఆర్జివి ఎంత తెలివైన వాడే తెలిసిపోయింది.

వంగవీటి సినిమాకు ముందు వంగవీటి ఫ్యాన్స్ సపోర్ట్ ఉండగా ఆఫ్టర్ రిలీజ్ సినిమా సరిగా తీయలేదని వర్మ మీద వంగవీటి ఫ్యాన్స్ రివర్స్ అయ్యారు. అప్పట్లో వర్మని విజయవాడ రానివ్వనని చెప్పి నానా హంగామా చేశారు. అయితే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ విషయంలో కూడా అదే జరుగబోతుందని ఆశిస్తున్నారు ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్. కేవలం ఎన్.టి.ఆర్ క్రేజ్ ను చూసి లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాపై హైప్ వచ్చిందని సినిమాలో పెద్దగా మ్యాటర్ ఉండకపోవచ్చని అంటున్నారు.

అంతేకాదు సినిమా ట్రైలర్ లో చూపించిన కాన్ ఫ్లిక్ట్స్ అన్ని సినిమాలో చాలా తెలివిగా డీల్ చేసి ఉంటాడని తెలుస్తుంది. అది వర్మకు బాగా తెలిసిన విద్య కర్ర విరగ కూడదు.. పాము చావకూడదు అన్నట్టుగా కేవలం పబ్లిసిటీ కోసమే వర్మ ఇలా చేస్తాడని అంటున్నారు. మరి వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అసలు ఎలా ఉంటుంది.. ఎలా ఉండబోతుంది అన్నది సినిమా చూస్తేనే కాని చెప్పగలం.

Leave a comment