‘118’ వీకెండ్ కలెక్షన్లు.. లాభమా.? నష్టమా.?

‘118’వీకెండ్ కలెక్షన్లు!
టాలీవుడ్ లో నందమూరి కుర్రోడు కళ్యాన్ రామ్ నటించిన ఫటాస్ బక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. ఈ సినిమా తర్వాత కళ్యాన్ రామ్ కి ఒక్క సినిమా కూడా కలిసి రాలేదు. కళ్యాణ్ రామ్ కెరీర్ లో మొట్టమొదటి సారిగా ‘నా నువ్వే’ అనే ఫుల్-లెంగ్త్ ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఆ సినిమా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఇక ఎన్టీఆర్ బయోపిక్ లో హరికృష్ణ పాత్రలో కనిపించిన ఆ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు.

కళ్యాణ్ రామ్ హీరోగా గత వారం రిలీజ్ అయిన ‘118’ అనే థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. శాలిని పాండే, నివేదా థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న ఏ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరిస్తారన్న విషయం తెలిసిందే.

ఓపెనింగ్ రోజు నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను అందుకుంటోంది. వీకెండ్ సమయం కావడంతో సినిమాకు బాగానే వర్కవుట్ అయింది. ప్రస్తుతానికి బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా కూడా పోటీ లేకపోవడం ‘118’కి బాగా కలిసి వస్తుందనే చెప్పొచ్చు.

ఏరియావైజ్ కలెక్షన్లు :

నిజాం: రూ. 2.82 కోట్లు
సీడ్: రూ 1.02 కోట్లు
వైజాగ్: రూ .72 కోట్లు
గుంటూరు: రూ .51 కోట్లు
ఈస్ట్: రూ 0.42 కోట్లు
వెస్ట్: రూ 0.32 కోట్లు
కృష్ణ: రూపాయలు 0.52 కోట్లు
నెల్లూరు: రూ 0.16 కోట్లు

ఎపి, తెలంగాణ: రూ. 6.49 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ .60 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్: రూ 0.30 కోట్లు

మొత్తం ప్రపంచవ్యాప్తంగా: రూ. 7.39 కోట్లు

Leave a comment