అన్నతమ్ముళ్ల మధ్య యుద్ధం.. గెలుపు ఎవరిది.?

మార్చి 10న అంటే ఆదివారం జరుగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ ఎన్నికల సందర్భంగా సినిమా పరిశ్రమ అంతా హాట్ హాట్ డిస్కషన్స్ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అధ్యక్షుడిగా చేసిన శివాజి రాజా మళ్లీ బరిలో దిగుతుండగా సీనియర్ హీరో నరేష్ అతనికి పోటీగా దిగుతున్నాడు. శివాజి రాజా ప్యానెల్ లో హీరో శ్రీకాంత్ ఉన్నాడు. అందుకే దాదాపుగా మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ ఆయనకే ఉంటుంది. పరిశ్రమ పెద్దగా శివాజిరాజా, నరేష్ లను మీట్ అయినా శివాజిరాజా ప్యానెల్ కే చిరంజీవి సపోర్ట్ గా ఉంటారని తెలుస్తుంది.

ఇదిలాఉంటే మెగాస్టార్ తమ్ముడు మెగా బ్రదర్ నాగబాబు నరేష్ కు సపోర్ట్ గా నిలిచారు. రీసెంట్ గా నరేష్ ప్యానెల్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాగబాబు తన సపోర్ట్ నరేష్ కే అంటూ చెప్పడం జరిగింది. అన్నేమో శివాజి రాజాకి సపోర్ట్ చేయాలని అనుకుంటుంటే నాగబాబు మాత్రం నరేష్ కు సహకారం అందిస్తున్నాడు. అయితే నాగబాబు నరేష్ ప్యానెల్ కు సపోర్ట్ గా నిలవడానికి ప్రధాన కారణం జీవిత రాజశేఖర్. ఆమెను ప్రధాన కార్యదర్శిగా నిలబెట్టారు. పరిశ్రమలో మహిళల బాగుకోసం పనిచేస్తున్న నరేష్ ప్యానెల్ మంచి పనితీరు కనబరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మెగాస్టార్ సపోర్ట్ కాకుండా శివాజి రాజాకు కొంతమంది ఆర్టిస్టుల సపోర్ట్ ఉంది. అయితే నరేష్ ప్యానెల్ కు ప్రభాస్, మహేష్ వంటి స్టార్స్ అండగా ఉన్నారు. అంతేకాదు ఒకళ్లే కంటిన్యూస్ గా మా అధ్యక్షుడిగా ఉండటం మంచిది కాదని నాగబాబు చెప్పడం కచ్చితంగా నరేష్ ను గెలిపించాలని చెప్పినట్టు అనిపిస్తుంది. మరి అసలు ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Leave a comment