మహేష్ తో రొమాన్స్ కి సిద్ధమైన సాయి పల్లవి..?

ప్రస్తుతం తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో బిజీ హీరోయిన్లలో ఒకరు సాయి పల్లవి. ప్రేమమ్ సినిమాతో తన ప్రస్ధానం మొదలు పెట్టిన సాయి పల్లవి తెలుగు లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘ఫిదా’సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటించింది. ఈ సినిమాలో భానుమతి హైబ్రీడ్ పీస్..ఒక్కత్తే అంటూ తెలంగాణ యాసతో సాయి పల్లవి అల్లరి నటన తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో సాయి పల్లవి వరుస ఛాన్సులు దక్కించుకుంటూ వస్తుంది.

తాజాగా ఈ బ్యూటీ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ఛాన్స్ కొట్టేసిందంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేశ్ బాబు తన 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ చేస్తున్నాడు. తన 26వ సినిమాను ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నాడు. దీనికి సంబంధించిన పనులు చక చకా అయిపోతున్నాయి.

అయితే తెలుగు లో ఆ పాత్రకు సాయి పల్లవి అయితే సరిగా సరిపోతుందని అనీల్ రావిపూడి భావించాట.. ఈ సినిమా లైన్ ఆమెకి వినిపించడానికి అనిల్ రావిపూడి చెన్నైకి వెళ్లినట్టుగా చెప్పుకుంటున్నారు. మొత్తానికి మహేశ్ బాబు 26వ సినిమాలో సాయి పల్లవి నటించే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ని తీసుకోవొచ్చని భావిస్తున్నారు.

Leave a comment