మోహమాటానికి పోయి కష్టాలు తెచ్చుకున్న హీరోయిన్..!

సిని పరిశ్రమలో ఎవరికి ఎప్పుడు ఎలాంటి అవకాశాలు వస్తాయన్నది ఎవరం చెప్పలేం.. ముఖ్యంగా హీరోయిన్స్ కొందరికి ఒక్క సినిమాతోనే అదిరిపోయే క్రేజ్ వస్తుండగ మరికొందరికి చిన్న చిన్నగా పాపులారిటీ వస్తుంది. ఒక్కసారి స్టార్ ఇమేజ్ వస్తే అది నిలబెట్టుకోవడం కూడా తెలియాలి. ఇదిలాఉంటే మళయాళ భామల హవా తెలుగు పరిశ్రమలో కొనసాగుతుండగా లేటేస్ట్ గా అది మరీ ఎక్కువైందని తెలుస్తుంది. మళయాళ భామలు కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ సౌత్ లో మంచి ఫాం లో ఉన్నారు.

అయితే వారిలో కీర్తి సురేష్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. అందం అభినయం రెండు ఉన్న కీర్తి సురేష్ మంచి అవకాశాలు అందుకుంటుంది. అయితే అటు ఇటుగా అదే రేంజ్ లో ఉండే అనుపమ పరమేశ్వరన్ మాత్రం ఇంకా యువ హీరోల సరసన మాత్రమే నటిస్తుంది. మళయాళ ప్రేమం సినిమాలో నటించి మెప్పించిన అనుపమ తెలుగులో త్రివిక్రం డైరక్షన్ లో అ ఆ సినిమాతో అలరించింది. ఇక ప్రేమం రీమేక్ లో కూడా ఆకట్టుకోగా శతమానం భవతితో సోలో హిట్ కొట్టింది.

స్టార్ రేంజ్ హీరోయిన్ కు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్న అనుపమ ఎందుకో వెనుకపడుతుంది. అయితే ఈమధ్య తను మొహమాటానికి పోయి సినిమాలను చేయబట్టే ఇలా ఉన్నానని చెప్పుకొచ్చింది. కొన్ని సినిమాలు చేసిన తర్వాత అనవసరంగా చేశానని అనుకున్నానని.. అయితే ఇక మీదట మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వనని అంటుంది అనుపమ పరమేశ్వరన్.. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయట. మరి అమ్మడు కోరుకునే స్టార్ ఛాన్స్ అనుపమకి త్వరలోనే రావాలని ఆశిద్దాం.

Leave a comment