బాహుబలి రికార్డ్స్ కి చెక్ పెట్టిన సర్కార్..!

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న సినిమా సర్కార్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీపావళి కానుకగా రాబోతున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లో హయ్యెస్ట్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సర్కార్ సినిమా 3500 థియేటర్స్ లో రిలీజ్ అవుతుందట.

ఇక చెన్నైలో కూడా భారీగానే రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. సర్కార్ సినిమా మొదటి రోజు చెన్నైలోనే 25 కోట్ల కలక్షన్స్ రాబట్టేలా ప్లాన్ చేశారు. బాహుబలి రికార్డులను బద్ధలు కొట్టేలా అన్ని చోట్ల భారీ ప్రీమియర్స్ సర్కార్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. తెలుగులో కూడా విజయ్ కెరియర్ లో ఎన్నడు లేని విధంగా 750 థియేటర్స్ లో సర్కార్ సినిమా రిలీజ్ కాబోతుంది.

మరి సర్కార్ సంచలనాలు ఏ రేంజ్ లో ఉంటాయో తెలుసుకోవాలంటే 24 గంటలు వెయిట్ చేస్తే సరిపోతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సర్కార్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. ఏ.ఆర్ రహమాన్ మ్యూజిక్ అందించగా ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Leave a comment