దీవాలి కానుకగా ఫ్యాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వనున్న చరణ్, బోయపాటి..

రంగస్థలం తర్వాత రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబందించి రోజుకో కొత్త టైటిల్ ప్రచారం లో ఉంది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ విషయాల గురించి అఫిషియల్ గా నిర్మాణ సంస్థ నుండి క్లారిటీ వచ్చింది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు అనగా నవంబర్ 6న మధ్యహ్న్మ 1 గంటకు రిలీజ్ చేస్తున్నారట.

ఇక టీజర్ కూడా నవంబర్ 9న ఉదయల్ 10:25 గంటలకు రిలీజ్ చేస్తారని ఎనౌన్స్ చేశారు. వినయ విధేయ రామా అన్న టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ లో టైటిల్ అదే ఉంటుందో లేక మరోదైనా టైటిల్ తో సర్ ప్రైజ్ చేస్తారో చూడాలి. దీపావళి కానుకగా చరణ్ మెగా అభిమానులకు ఇస్తున్న సర్ ప్రైజ్ గిఫ్ట్ బాగుంది. ఫస్ట్ లుక్ టీజర్ తో బోయపాటి, చరణ్ ల హంగామా షురూ అవుతుండగా సినిమా ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి.

Leave a comment