25 వ రోజూ … అదే జోరు ! కలెక్షన్స్ మోత మోగిస్తున్న అరవింద సమేత !

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ అండ్ ఎమోషనల్ సినిమా ‘ అరవిందసమేత’ విడుదల అయిన దగ్గర నుంచి రికార్డులు బద్దలుకొడుతూనే ఉంది. త్రివిక్రమ్ డైలాగులు, డైరెక్షన్ ఈ సినిమాకు అదనపు బలం కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా చూసుకున్నా … సునామి సృష్టిస్తూనే ఉంది.

24 రోజుల తర్వాత 25 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. మరీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ కాకపోయినా… సినిమా రిలీజ్ అయిన 25 వ రోజు కూడా లిమిటెడ్ థియేటర్స్ లో మంచి వసూళ్లు రెండు రాష్ట్రాలలో రాబట్టగలిగింది. సినిమా మొత్తం మీద 25 వ రోజు రెండు రాష్ట్రాలలో 16 లక్షల నుండి 18 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుందట.

ఇక సినిమా కర్ణాటకలో షిఫ్ట్ వైస్ సుమారు 12 థియేటర్స్ లో ఆడుతుండగా అక్కడ సినిమా 25 వ రోజు మొత్తం మీద 2 లక్షల లోపు కలెక్షన్స్ ని సాధించినట్లు తెలుస్తోంది. దీంతో… ఈ సినిమా 25 వ రోజు మొత్తంగా… 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 163.45 కోట్ల రేంజ్ లో ఉండగా 25 వ రోజు కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే 24వ రోజు కన్నా ఫర్వాలేదనే చెప్పాలి.

Leave a comment