Movies'నన్ను దోచుకుందువటే' రివ్యూ & రేటింగ్

‘నన్ను దోచుకుందువటే’ రివ్యూ & రేటింగ్

సుధీర్ బాబు హీరోగా ఆర్.ఎస్ నాయుడు డైరక్షన్ లో వచ్చిన సినిమా నన్ను దోచుకుందువటే. సుధీర్ బాబు సొంత బ్యానర్ నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆకట్టుకుంది. నభా నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం.

కథ :

కార్తిక్ (సుధీర్ బాబు) ఓ స్ట్రిక్ట్ మేనేజర్.. తన ఆఫీస్ లో ఉన్న ప్రతి ఒక్కరు స్ట్రిక్ట్ గా పనిచేయాలని కోరుకునే వ్యక్తి. మేఘన (నభా నటేష్) ఓ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆమెను చూసిన కార్తిక్ ఆమెతో పరిచయం పెంచుకోవాలని అనుకుంటాడు. అతను కూడా షార్ట్ ఫిల్మ్ లో నటించాలని కండీషన్ పెట్టగా నటిస్తాడు. ఓ పక్క ఫ్యామిలీకి ఇచ్చిన మాట.. మరో పక్క తన ప్రేమని గెలిపించుకోవాలన్న తపన ఈ క్రమంలో కార్తిక్ ఏం చేశాడు అన్నది సినిమా కథ.

Nannu-Dochukunduvate-Offici

నటీనటుల ప్రైభ :

కార్తిక్ పాత్రలో సుధీర్ బాబు తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. నిర్మాతగా కూడా మారాడు కాబట్టి సినిమా మీద మరింత బాధ్యతగా వ్యవహరించాడు సుధీర్ బాబు. ఇక హీరోయిన్ నభా నటేష్ పాత్ర అలరించింది. తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో స్క్రీన్ స్పేస్ ను వాడుకుంది. ఇక సుదర్శన్ కామెడీ అలరించింది. షార్ట్ ఫిల్మ్ హీరో షన్ముక్ కూడా రెండు మూడు సీన్స్ లో కనిపించాడు. నాజర్, తులసి పాత్రలు అలరించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో సుధీర్ బాబు చాలా అందంగా కనిపించాడు. అంజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అలరించింది. దర్శకుడు ఆర్.ఎస్ నాయుడు కథ, కథనాలు కొత్తగా లేకున్నా ఎమోషనల్ గా సినిమా నడిపించాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సుధీర్ బాబు మొదటి సినిమా అయినా నిర్మాతగా బాగా ఖర్చు పెట్టాడు.

విశ్లేషణ :

సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం మంచి టాక్ వచ్చినా కలక్షన్స్ రాలేదు. అందుకే ఈసారి తానే నిర్మాతగా మారి సక్సెస్ టార్గెట్ తో వచ్చిన సినిమా నన్ను దోంచుకుందువటే. ఆర్.ఎస్ నాయుడు డైరక్షన్ లో సుధీర్, నభా నటేష్ లీడ్ రోల్స్ గా నటించిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చింది.

సినిమా లో మొదటి భాగం అంతా కామెడీతో నడిపించాడు దర్శకుడు. సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా నడుస్తుంది. 149 నిమిషాల డ్యూరేషన్ సినిమాకు కాస్త మైనస్ అని చెప్పాలి. సుధీర్ బాబు ఈ సినిమాలో కార్తిక్ రోల్ లో ఆకట్టుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా సుధీర్ బాబు గట్స్ ను మెచ్చుకోవాల్సిందే.

కథ, కథనాలు కొత్తగా లేకున్నా యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సుధీర్ బాబు ఈ సినిమాతో మెప్పిస్తాడని మాత్రం చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

లీడ్ పెయిర్

సినిమాటోగ్రఫీ

ప్రొడక్షన్ వాల్యూస్

కామెడీ

మైనస్ పాయింట్స్ :

రొటీన్ స్టోరీ

అక్కడక్కడ స్లో అవడం

బాటం లైన్ :

సుధీర్ నన్ను దోచుకుందువటే.. మెప్పించే ప్రయత్నమే..!

రేటింగ్ : 2.75/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news