Moviesసీడెడ్‌లో అరవింద సమేత ధర.. వీర రాఘవ సత్తా ఇది..!

సీడెడ్‌లో అరవింద సమేత ధర.. వీర రాఘవ సత్తా ఇది..!

త్రివిక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్ హీరోగా వస్తున్న అరవింద సమేత సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. సెప్టెంబర్ రెండో వారం కల్లా షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్న చిత్రయూనిట్ ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాకు భారీ ఆఫర్ వస్తుండగా సీడెడ్ లో మాత్రం ఈ సినిమా సంచలనంగా మారుతుందని తెలుస్తుంది.

సీడెడ్ లో ఎన్.టి.ఆర్ స్టామినా చూపేలా అత్యధికంగా 15 కోట్ల బిజినెస్ చేసిందట. ఎన్.టి.ఆర్ కెరియర్ లో ఈ రేంజ్ లో సీడెడ్ రైట్స్ అమ్ముడవడం ఇదే మొదటిసారి. ఇక సీడెడ్ లో అంతకుముందు కేవలం మూడు సినిమాలు మాత్రమే 15 కోట్లు దాటాయి. అందులో ఒకటి బాహుబలి 25 కోట్లతో మొదటిస్థానంలో ఉండగా. అజ్ఞాతవాసి 16.5 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది. రంగస్థలం 12.5 కోట్లతో 3వ స్థానంలో ఉండగా ఎన్.టి.ఆర్ అరవింద సమేత 15 కోట్లతో 3వ స్థానంలోకి వెళ్లింది.

పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న అరవింద సమేత వీర రాఘ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈషా రెబ్బ కూడా ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news