Moviesవిశాల్ అభిమన్యుడు హిట్టా ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

విశాల్ అభిమన్యుడు హిట్టా ఫట్టా.. ప్లస్సులేంటి.. మైనస్సులేంటి..!

విశాల్ హీరోగా మిత్రన్ డైరక్షన్ లో ఆల్రెడీ తమిళంలో హిట్ అయిన సినిమా అభిమన్యుడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. సైబర్ క్రైం పై అభిమన్యుడు యుద్ధం బాగుంది.

సినిమా దర్శకుడు ప్రతి చిన్న విషయాన్ని ఎంతో కూలంకశంగా చూపించాడు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాల మీద కొరడా వేస్తూ వచ్చింది అభిమన్యుడు. సినిమాగా చూపించడమే కాదు ఇలా జరుగుతుంది అని చెప్పాడు దర్శకుడు మిత్రన్. ఇక విశాల్ నటన సినిమాకు మరో హైలెట్. విలన్ గా అర్జున్ కూడా అలరించాడు.

కథ ఎంత కొత్తగా రాసుకున్నాడో కథనం కూడా అంతే థ్రిల్లింగ్ గా రాసుకున్నాడు. సినిమాలో ప్రతి అంశం మీద దర్శకుడు విశ్లేషణ చాలా బాగుంది. ఇక సినిమాలో అన్ని అంశాలు కలిసి రాగా.. సెకండ్ హాఫ్ కాస్త కన్ ఫ్యూజ్ చేసిన కథనం చిన్న పాయింట్ నెగటివ్ గా అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా మాత్రం ఆడియెన్స్ కు మంచి అనుభూతిని కలిగిస్తుందని చెప్పొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news