Moviesనాగార్జున ఆఫీసర్ హిట్టా.. ఫట్టా.. ప్లస్సులు.. మైనస్సులు..!

నాగార్జున ఆఫీసర్ హిట్టా.. ఫట్టా.. ప్లస్సులు.. మైనస్సులు..!

కింగ్ నాగార్జున, సెన్సేషనల్ డైరక్టర్ ఆర్జివి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆఫీసర్. శివ, గోవిందా గోవిందా తర్వాత పాతికేళ్లకు ఈ ఇద్దరి కలిసి చేసిన సినిమా ఇది. ఈరోజు రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. నాగార్జునతో సినిమా అంటే మంచి కథ ఉండాలన్న పాయింట్ గుర్తించిన వర్మ. నాగ్ తో మంచి కంటెంట్ ఉన్న కథతోనే ఈ ఆఫీసర్ సినిమా తీశాడని తెలుస్తుంది.

ఇంటెన్సిటీ ఉన్న కథ.. దానికి తగినట్టుగానే నాగార్జున కూడా యాక్షన్ హీరోగా తనని తాను మళ్లీ కొత్తగా ఆవిష్కరించుకున్నారు. సినిమా టేకింగ్ అయితే ఫస్ట్ క్లాస్ గా సాగింది. కథ దానితో పాటుగా కథనం అంతా గ్రిప్పింగ్ గా సాగింది. రెగ్యులర్ ఆర్జివి సినిమాలకు కాస్త భిన్నంగా ఈ ఆఫీసర్ ఉందని చెప్పొచ్చు. పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా చాలా రోజుల తర్వాత వర్మకు హిట్ ఇచ్చిందని అంటున్నారు.

ఇక సినిమ అక్కడక్కడ కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది. రన్ టైం తక్కువవడం వల్ల పెద్ద ఇంపాక్ట్ కనబడదు. హీరోయిన్ మైరా సరీన్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఓవరాల్ గా సినిమా వర్మ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు నాగార్జున అభిమానులకు నచ్చేస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news