Gossipsచిరు, బాలయ్యలపై రజిని కామెంట్స్..!

చిరు, బాలయ్యలపై రజిని కామెంట్స్..!

తమిళ హీరోనే అయినా తెలుగులో కూడా ఇక్కడ స్టార్స్ కు సమానంగా ఫ్యాన్స్ ఉన్న హీరో సూపర్ స్టార్ రజినికాంత్. తన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తూ వస్తున్న రజినికాంత్ లేటెస్ట్ గా కాలాను తెలుగులో వదులుతున్నాడు. పా. రంజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. కేవలం చిత్రయూనిట్ మాత్రమే పాల్గొన్న ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ రజిని స్పీచ్ తెలుగు స్టార్ హీరోల అభిమానులను ఖుషి చేసింది. అంతకుముందు మాట్లాడిన కాలా చిత్ర నిర్మాత కోలీవుడ్ హీరో ధనుష్.. ఒక్కడే రజినికాంత్ అంటూ కామెంట్ చేశాడు.

ఇక తెలుగు సినిమా తెలుగు అభిమానుల మీద తన అభిమానం ఏంటో వెళ్లడించిన రజినికాంత్ తమిళ ప్రేక్షకులతో సమానంగా తెలుగు ఆడియెన్స్ తనని ఆదరిస్తున్నారని అన్నారు. ఇక ధనుష్ చేసిన ఒక్కడే రజినికాంత్ కామెంట్ ను ప్రస్థావిస్తూ ఒక్కడే చిరంజీవి, ఒక్కడే నాగార్జున, ఒక్కడే వెంకటేష్, ఒక్కడే బాలకృష్ణ.. అంటూ ఫ్యాన్స్ ను ఉత్తేజపరచాడు.

అవకాశం వస్తే అది లక్ అని కొందరంటారు.. దేవుని ఆశీర్వాదమని కొందరంటారు. ఎవరికి వారు తమ టాలెంట్ కృషితో మంచి స్థాయిని సంపాదిస్తారని అన్నారు. ఇక తెలుగు మాట్లాడటం మొదలుపెట్టిన మొదట్లోనే ఎన్.టి.ఆర్, దారి నారాయణ రావు పేర్లు ప్రస్థావించి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలిచాడు రజిని.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news