Reviewsవిశాల్ అభిమన్యుడు రివ్యూ & రేటింగ్

విశాల్ అభిమన్యుడు రివ్యూ & రేటింగ్

విశాల్ హీరోగా మిత్రన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా అభిమన్యుడు. తమిళంలో ‘ఇరుంబు తిరై’గా రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ హిట్ కొట్టిన ఈ సినిమా తెలుగులో అభిమన్యుడుగా వచ్చింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సైబర్ క్రైం నేరాల నేపథ్యంలో వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూసేద్దాం.

కథ :

మిలిటరీ మేనేజర్ అయిన కరుణ (విశాల్) చెల్లి పెళ్లికోసం ఊళ్లో ఉన్న భూమిని అమ్మేస్తాడు. దానితో పాటుగా బ్యాంక్ లోన్ కూడా తీసుకుంటాడు. మొత్తం పది లక్షలు అతని ఎకౌంట్ నుండి మాయమవుతాయి. కారణాలు ఏంటో తెలుసుకునే క్రమంలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. వైట్ డెవిల్ వ్యక్తులకు సంబంధించిన ఆధారాలతో వారి ఎకౌంట్ లో ఉన్న డబ్బు మాయం చేస్తాడు. ఈ వైట్ డెవిల్ తో కరుణ ఫైట్ ఎలా సాగింది. అతని నెట్ వర్క్ ను ఎలా కుప్పకూల్చాడు. సైబర్ క్రైం పై కరుణ చేసిన పోరాటం ఏంటి అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

విశాల్ మిలిటరీ ఆఫీసర్ గా అదరగొట్టాడు. సినిమాలో తన పాత్ర చాలా చక్కగా ఒదిగిపోయాడు. ఇక సమంత హీరోయిన్ గా మంచి స్కోప్ ఉన్న పాత్రే చేసింది. విలన్ గా అర్జున్ మరోసారి తన సత్తా చూపించారు. సినిమాలో బలమైన విలన్ గా అర్జున్ అదరగొట్టారు. ఇక మిగతా పాత్రలన్ని అలరించాయి.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమా దర్శకుడు ఓ అద్భుతమైన పాయింట్ ను తీసుకుని సినిమా తెరకెక్కించాడు. నిత్యం మనం వింటూ ఉండే కాన్సెప్ట్ నే సినిమాగా మలచిన తీరు బాగుంది. కథ మాత్రమే కాదు దాన్ని బలం చేకూర్చేలా రాసుకున్న కథనం కూడా బాగుంది. సినిమాటోగ్రఫీ ఫస్ట్ క్లాస్ గా ఉంది. పాటలు బాగున్నాయి. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ముఖ్యంగా సినిమాలో డైలాగ్స్ బాగా రాసుకున్నారు. ప్రెజెంట్ ఇష్యూస్ మీద దర్శకుడు కౌంటర్ వేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు ఎంత కావాలో అంత రిచ్ గా తీశారు.

విశ్లేషణ :

సైబర్ క్రైం.. సాధారణ మనుషులను వణికించే శక్తి. మనకు తెలియకుండా తెలిసిన వ్యక్తికి కాని, తెలియని వ్యక్తికి కాని మన డేటా ఇస్తే ఎలాంటి సమస్యల్లో పడతామో చెప్పే సినిమా. సినిమా చూసిన ప్రతి ఒక్క ఆడియెన్ కు ఈ సినిమా కనెక్ట్ అవుతుంది. అంతేకాదు సినిమా ఇంపాక్ట్ ప్రకారం సినిమా చూసి వచ్చాక మనకు సంబందించిన ఏ ప్రూఫ్ అయినా బయటకు ఇవ్వాలంటే భయపడతాం.

ఆ రేంజ్ లో సైబర్ క్రైం నేరాలు ఎలా జరుగుతున్నాయో కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు మిత్రన్. సైబర్ క్రైం పై ఇలా క్లియర్ కట్ గా పూర్తి స్థాయి విశ్లేషణతో వచ్చిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. వైట్ డెవిల్ తన స్వార్ధం కోసం జనాల సొమ్ముని కాజేస్తాడు. అది కూడా వారికి ఏమాత్రం తెలియకుండానే.

ఓ పకడ్బందీ స్క్రిప్ట్ కు అదే రేంజ్ లో స్క్రీన్ ప్లే రాసుకుని సినిమా తెరకెక్కించాడు డైరక్టర్. డబ్బింగ్ సినిమా అన్న భావన రాకుండానే చాలా కష్టపడ్డారు. తెలుగు ఆడియెన్స్ కూడా మెచ్చేలా ఈ సినిమా ఉంటుంది.

ప్లస్ పాయింట్స్ :

విశాల్

స్టోరీ

స్క్రీన్ ప్లే

థ్రిల్లింగ్ అంశాలు

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడ కన్ ఫ్యూజ్

సాంగ్స్

బాటం లైన్ :

సైబర్ క్రైం పై ‘అభిమన్యుడు’.. హెచ్చరిక బాగుంది..!

రేటింగ్ : 3/5

Latest news